Monday, June 13, 2005

ఇక్కడ నిద్ర అమ్మబడును !!!!

మీ రీసెర్చ్ పని వల్ల మీకు నిద్ర పోవడానికి సమయం చిక్కట్లేదా ?
మీ రూములోవారు మిమ్మల్ని గుర్రు పెట్టనివ్వకుండా అడ్డుకుని మీ నిద్ర పాడుచేస్తున్నారా ?
మీరు కాని, మీ రూములో వారు కాని నిద్ర లేమి తో బాధ పడుతున్నారా ?
మీ నిద్ర "మీరు పోవడం దేనికి సమయం వృధా ఆ పని వేరే వాళ్ళకి అప్పగిస్తే బాగుంటుంది" అని అనుకుంటున్నరా ?

లేక కోడికూతలాగా కానీ పిల్లి మూలిగినట్టుగా కానీ ఏనుగు ఘీంకరించినట్టుగా కాని, గుర్రు పెట్టాలని మీ చిరకాలం కోరికా ?

అయితే మీ అందరికీ అందిస్తున్నాం ఒక సువర్ణావకాశం !!!!
మీలాంటి ప్రజల యొక్క శుభాశీస్సులతో, మరియు మా శ్రేయోభిలాషుల యొక్క శుభాకాంక్షలతో, ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా ఈ లెక్షింగ్టన్ నగరంలో ప్రవేశపెడుతున్నాం,

తినితొంగుంటాం Inc.

ప్లేస్ మీరు చెప్తారా లేక మమ్మల్ని చెప్పమంటారా ?
టైం మీరు చెప్తారా లేక మమ్మల్ని చెప్పమంటారా ?
ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే !!!

రెండు నిముషాల్లో చిటుక్కున నిద్రలోకి జారి రెండు రోజులు నిర్విరామంగా నిద్ర పోయే అత్యున్నత నైపుణ్యం గల నిద్రాసురులు మా వద్ద వున్నారు.

రీసెర్చ్ అసిస్టెంట్ల కోసం ప్రత్యేకంగా మా రెడ్డిగారు రీసెర్చ్ పని చేసి వచ్చిమరీ పడుకుంటారు.
RA వర్కు మరియు పార్టైం ఉద్యోగం రెండూ చేసే వారికి తగినట్టుగా, రోజుని ఇరవైనాలుగు గంటలకంటే ఎక్కువ పొడిగించి మరీ ముసుగు తన్ని పడుకోగల సమర్థులు మా మీసాలరాజుగారు.

నూటికి నూరు శాతం శాటిస్ఫాక్షన్ గ్యారంటీ లేకపోతే మీ నిద్ర మీకు తిరిగి ఇచ్చేయబడును !!!!!

ఇక ఆలస్యం దేనికి ??
రండి!!! త్వరపడండి!!!
నిద్రతో తూలుతూ రండి !!!
నిద్రలేమితో కళ్ళు వాయగొట్టుకొని మరీ రండి !!!

మొదట వచ్చిన పది మందికీ గంటకి ఇంకొక గంట ఉచితంగా నిద్ర పోతారు మావాళ్ళు.

అలస్యం దేనికి ఇంక ఈ క్రింది చిరునామాను సంప్రదించండి:
తినితొంగుంటాం Incorporated.
ప్రెస్సువారి వీధి
లెక్షింగ్టన్ నగరం
కెంటక్కీ 40508
అ.సం.రా. (అమెరికా సంయుక్త రాష్ట్రాలు)

ముఖ్య గమనిక: మా వారికి కలలు కనటంలో కూడా మహాప్రావీణ్యం కలదు.
కలలు కవాలనుకున్న వారు వారి వారి ఇష్టాయిష్టాలను విపులంగా వివరిస్తే ....
వాటికి తగినట్టుగా మావాళ్ళు పగలు రాత్రి అని లేకుండా కంటారు ................................

........................ కలలు !!!!!!

------ప్రొప్రెయిటరు